మీ కరెంట్‌ రీడింగ్‌ మీరే చెప్పండి!

6 May, 2021 15:04 IST|Sakshi

కోవిడ్‌ నేపథ్యంలో ప్రత్యేక యాప్‌లు తెస్తున్న డిస్కంలు 

వినియోగదారులే విద్యుత్‌ రీడింగ్‌ తీసి పంపించేలా ఏర్పాట్లు 

యూనిట్లు లెక్కించి వినియోగదారులకు ఎస్సెమ్మెస్‌ రూపంలో బిల్లు 

ప్రస్తుతానికి మే నెలలో మాత్రమే ఈ సదుపాయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు వినూత్నంగా సెల్ఫ్‌ బిల్లింగ్‌ సిస్టంను అమలు చేయబోతున్నాయి. కోవిడ్‌ విజృంభన దృష్ట్యా సిబ్బంది ఇంటింటికి తిరిగి స్పాట్‌ బిల్లింగ్‌ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. వినియోగదారులే స్వయంగా మీటర్‌ రీడింగ్‌ తీసి పంపించేందుకు మొబైల్‌ యాప్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఎన్పీడీసీఎల్‌ ఈ సేవలను తన టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ ఐటీ వింగ్, భారత్‌ సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ యాప్‌ల ద్వారా బుధవారం నుంచి అందుబాటులోకి తెచ్చింది.

https://play.google.com/store/apps/details?id=in.tsnpdcl.tsnpdcl లింక్‌ను క్లిక్‌ చేయడం ద్వారా ‘టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ ఐటీ వింగ్‌’ అనే యాప్‌ను.. https://play.google.com/store/ apps/details? id= in.coral.met లింక్‌ను క్లిక్‌ చేయడం ద్వారా ‘భారత్‌ సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. గతేడాది మార్చిలో లాక్‌డౌన్‌ విధించడంతో ఏప్రిల్, మే నెల ల్లో మీటర్‌ రీడింగ్‌ తీయడం సాధ్యం కాలేదు. జూన్‌ లో మూడు నెలల రీడింగ్‌ తీసి బిల్లులు ఇచ్చాయి. దీంతో స్లాబులు మారి భారీగా బిల్లులు రావడంతో వినియోగదారులు ఆందోళన పడ్డారు. దీనికి పరిష్కారంగా సెల్ఫ్‌ బిల్లింగ్‌ అమలు చేయనున్నాయి.  

స్పాట్‌ బిల్లర్లు రాకుంటేనే.. 
ప్రస్తుత మే నెలలో స్పాట్‌ బిల్లింగ్‌ సిబ్బంది ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీయకపోతే, రెండు రోజులు వేచి చూసి ఆ తర్వాత సెల్ఫ్‌ బిల్లింగ్‌ సదుపాయాన్ని వాడుకోవాలని టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సీఎండీ ఎ.గోపాల్‌రావు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మే నెలలో మాత్రమే ఈ సదుపాయం కల్పిస్తున్నామని వెల్లడించారు. త్వరలో దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సైతం ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టబోతోంది.  

ఇలా వినియోగించాలి
టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ ఐటీ వింగ్‌ లేదా భారత్‌ మీటర్‌ రీడింగ్‌ యాప్‌ ఓపెన్‌ చేసి అందులో సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేసి సబి్మట్‌ సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ను ఎంపిక చేసుకోవాలి. తర్వాత వినియోగదారులు యూనిక్‌ సరీ్వస్‌ నంబర్, మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. అనంతరం స్కాన్‌ కేడబ్ల్యూహెచ్‌ రీడింగ్‌ను ఎంపిక చేసి మీటర్‌లోని కేడబ్ల్యూహెచ్‌ రీడింగ్‌ను స్కాన్‌ చేసి సబి్మట్‌ బటన్‌ క్లిక్‌ చేయాలి. అధికారులు ఆ ఫోటో ఆధారంగా విద్యుత్‌  బిల్లును ఎస్‌ఎంఎస్‌ రూపంలో పంపిస్తారు. 

మరిన్ని వార్తలు