సుర్రుమంటున్న సూర్యుడు

1 Mar, 2021 07:57 IST|Sakshi

ఆదివారం జిల్లాలో 36.19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

కరీంనగర్‌: ‘భానుడి ప్రతాపం మొదలైంది.. ఇప్పటి వరకు చలితో వణికిన ప్రజలు ఎండలను తలుచుకొని భయపడుతున్నారు. ఫిబ్రవరిలోనే ఎండలు మండుతున్నాయి.. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉక్కపోత మొదలైంది. ఆదివారం జిల్లాలో 36.19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పుడే ఇలా ఉంటే మే లో ఎలా అని జనం జంకుతున్నారు.’ఎండలు అప్పుడే మండుతున్నాయి. వాతావరణంలో మార్పులతో భూతాపం పెరుగుతోంది. పగటిపూట ఎండలు మండుతుండగా రాత్రి సమయంలో చలిగా ఉంటోంది. పగటి ఉష్ణోగత్రలు గత వారంరోజులుగా గరిష్టంగా 32 నుంచి 36 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతున్నాయి. రాత్రి ఉషోగ్రతలు 18 నుంచి 21 డిగ్రీల వరకు పడిపోతున్నాయి.

శివరాత్రికి శివశివా అంటూ చలికాలం వెళ్లిపోయి ఎండలు మండుతాయంటారు. కానీ శివరాత్రికి ముందే ఎండలు మండుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాదితో పోల్చితే ఈసారి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

>
మరిన్ని వార్తలు