Egg Incubation: గుడ్డు నుంచి పిల్ల వరకు.. 

12 Jul, 2021 13:44 IST|Sakshi

పాలమూరు యూనివర్సిటీలోని ఓ చెట్టుకు ఈ స్పైడర్‌ హంటర్‌ పక్షి గూడు కట్టడం నుంచి, అందులో గుడ్లు పెట్టి, పొదిగి పిల్లలు బయటికి వచ్చే వరకు వివిధ దశలను ‘సాక్షి’తన కెమెరాలో బంధించింది. ఈ పక్షికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పాలమూరు యూనివర్సిటీ జువాలజీ అధ్యాపకుడు రాజశేఖర్‌ ‘సాక్షి’తో పంచుకున్నారు.


ఈ పక్షి సైంటిఫిక్‌ పేరు ఆర్చినొతిరా లాంగిరోస్ట్రా. ఇంగ్లిష్‌ పేరు సన్‌బర్డు. సాధారణంగా స్పైడర్‌ హంటర్‌ అని పిలుస్తారని, ఈ పక్షి చిన్నపాటి చెట్లపై గూడు పెట్టి వర్షాకాలం ప్రారంభంలో కేవలం 15 నుంచి 16 రోజుల్లోనే గుడ్లు పెట్టి పొదిగి పిల్లలకు జన్మనిస్తాయని వెల్లడించారు. 
– మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌  

మరిన్ని వార్తలు