గవాక్షంలో సూరీడు! 

22 Mar, 2021 11:47 IST|Sakshi

ఆలయ నిర్మాణాల్లో శిల్పులు తమ ప్రత్యేకతకు చాటుకోవటం పరిపాటి. అలాంటి కోవలోనే లలితాంబికా తపోవనం రాజగోపురం నిలుస్తోంది.

సాక్షి, జడ్చర్ల టౌన్‌: ఆలయ నిర్మాణాల్లో శిల్పులు తమ ప్రత్యేకతకు చాటుకోవటం పరిపాటి. అలాంటి కోవలోనే 44వ నంబరు జాతీయ రహదారిపై జడ్చర్ల మండలం గొల్లపల్లి వద్ద ఉన్న లలితాంబికా తపోవనం రాజగోపురం నిలుస్తోంది.

దీనికి ఐదు గవాక్షాలు ఉండగా సూర్యుడు ఉదయించే సమయంలో వాటిల్లోనే పయనించడం విశేషం. ఆదివారం కనిపించిన సుందర దృశ్యాలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. సాధారణంగా భక్తులు గవాక్షాలను అంతస్తులుగా పిలుస్తారు. ఒక్కో గవాక్షం ఒక్కో అంతస్తుగా, గవాక్షాన్ని దర్వాజగా భావిస్తారు. ఆ దర్వాజలో నుంచే సూర్యోదయం జరగటాన్ని భక్తులు ఎంతో ఆసక్తిగా తిలకించారు.

చదవండి: అరే ఏంట్రా ఇది.. అలా తాగేస్తున్నారు!

మరిన్ని వార్తలు