నేడు సుప్రీం కోర్టు ముందుకు వినాయక విగ్రహాల నిమజ్జనం పిటిషన్‌

16 Sep, 2021 11:14 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: వినాయక విగ్రహాల నిమజ్జనం పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిమజ్జనం అంశానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. జీహెచ్‌ఎంసీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా  వాదనలు వినిపించనున్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతిని నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన  తీర్పుపై స్టే ఉత్తర్వులు ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ సుప్రీంకోర్టును విజ్ఞప్తి చేసింది. (చదవండి: సైదాబాద్‌ చిన్నారి కేసు: నిందితుడు రాజు ఆత్మహత్య

ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. ఊరేగింపుగా జరిగే వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించేందుకు అనేకమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని మూడు, నాలుగు నెలల ముందుగానే పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించామని జీహెచ్‌ఎంసీ పేర్కొంది.

చదవండి:
రాజు ఆత్మహత్య: కేటీఆర్‌ స్పందన..

 

మరిన్ని వార్తలు