యాదాద్రి సన్నిధిలో సుప్రీం న్యాయమూర్తి 

29 May, 2022 02:19 IST|Sakshi
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ దంపతులకు  ప్రసాదం అందజేస్తున్న ఇన్‌చార్జి ఈవో రామకృష్ణారావు  

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ సతీసమేతంగా శనివారం దర్శించుకున్నారు.  తూర్పు రాజగోపురం వద్ద ఆచార్యులు సంప్రదాయబద్ధంగా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పంచ నారసింహులను దర్శించుకొని పూజలు జరిపించారు.

శ్రీస్వామి వారిని దర్శించుకున్న జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ దంపతులకు ముఖ మండపంలో ఆచార్యులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ ఇన్‌చార్జి ఈవో రామకృష్ణారావు లడ్డూ ప్రసాదం అందజేశారు. ఆయన వెంట తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయన్, అశోక్‌ కుమార్‌ జైన్‌ తదితరులు ఉన్నారు.  

మరిన్ని వార్తలు