రామోజీకి ‘సుప్రీం’ నోటీసులు

11 Aug, 2020 01:51 IST|Sakshi

మార్గదర్శి కేసులో ఆర్‌బీఐని ప్రతివాదిగా చేర్చిన ధర్మాసనం

క్రిమినల్‌ అప్పీలును హైకోర్టు కొట్టేయడాన్ని సవాలు చేసిన మాజీ ఎంపీ ఉండవల్లి

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్‌బీఐ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా రూ.2,600 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసిందన్న అభియోగాలు ఎదుర్కొంటున్న మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)ని సుప్రీంకోర్టు ప్రతివాదిగా చేర్చిం ది. ఇప్పటికే ప్రతివాదులుగా ఉన్న రామోజీరావు, మార్గదర్శి ఫైనా న్షియర్స్, తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వాలు సహా ఆర్‌బీఐకి కూడా సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీచేసింది. మార్గ దర్శి సంస్థ అక్రమంగా డిపాజిట్లు సేకరించిందన్న అభియోగాలతో ట్రయల్‌ కోర్టులో దాఖలైన క్రిమినల్‌ కంప్ల యింట్‌ను ఉమ్మడి హైకోర్టు తన చివరి పని దినం రోజున కొట్టేస్తూ ఇచ్చిన తీర్పును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సవా లు చేశారు. ఆయన తరఫున మెస్స ర్స్‌ రమేష్‌ అల్లంకి అండ్‌ అసోసి యేట్స్‌ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఆర్‌. సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాతో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అప్పీలు చేయ నందున తాను ఎస్సెల్పీ దాఖలు చేసేందుకు అనుమతివ్వాలన్న అభ్యర్ధనకు ధర్మాసనం అనుమతించింది. అలాగే, ఎస్సెల్పీలోని ప్రతివాదులందరికీ నోటీసులు జారీచేసింది.

విభజనకు ఒకరోజు ముందు కొట్టేసింది
ఉండవల్లి తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.సత్యనారాయణ ప్రసాద్, న్యాయవాది అల్లంకి రమేష్‌ వాదనలు వినిపించారు. తమపై ఉన్న క్రిమినల్‌ కంప్లయింట్‌ (సీసీ) నెంబరు 540ను కొట్టివేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఉమ్మడి హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఉమ్మడి హైకోర్టు విభజనకు ఒకరోజు ముందు అంటే డిసెంబరు 31, 2018న కొట్టివేసిందని వివరించారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ ఆర్బీఐ చట్టం–1934లోని సెక్షన్‌ 45(ఎస్‌) నిబంధనను ఉల్లంఘించి డిపాజిట్లు వసూలు చేయగా.. ఉమ్మడి హైకోర్టు ఈ చట్టంలోని సెక్షన్‌ 45(ఎస్‌)ను తప్పుగా అన్వయించి క్రిమినల్‌ కంప్లయింట్‌ను కొట్టేసిందని నివేదించారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం 30.11.2006న రాసిన లేఖకు ఆర్‌బీఐ 2007 జూన్‌ 2న బదులిస్తూ ప్రతివాది చాప్టర్‌ 3బి కింద అర్హత కలిగిలేడని, సెక్షన్‌ 45ఎస్‌ కింద లావాదేవీలు జరిపేందుకు వీల్లేదని స్పష్టంచేసిందని వివరించారు. అలాగే, సివిల్‌ అప్పీళ్లు సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్‌లో ఉండగానే.. హైకోర్టు సీసీని కొట్టివేసిందని గుర్తుచేశారు.

ప్రతివాదిగా ఆర్‌బీఐని చేర్చిన ధర్మాసనం
జనవరి 24న జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఇంప్లీడ్‌ చేసింది. తాజాగా ఆర్బీఐను ప్రతివాదిగా చేర్చింది. అలాగే, జీఓ 801 ద్వారా అప్పటి సీఐడీ ఐజీ కృష్ణరాజును మార్గదర్శి సంస్థపై ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45(టి), సెక్షన్‌ 58(ఇ) కింద చర్యలు తీసుకునేందుకు వీలుగా న్యాయస్థా నంలో కేసు ఫైల్‌ చేసేందుకు అధీకృత అధికా రిగా నియమించినందున.. కృష్ణరాజును ప్రతి వాదిగా చేర్చాలన్న పిటిషనర్‌ అభ్యర్థన మేరకు కృష్ణరాజును ప్రతివాదిగా చేర్చింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా