సుప్రీం కోర్టు ఆదేశాలతో మరోసారి అగ్రిగోల్డ్‌ విచారణ

4 Nov, 2020 12:28 IST|Sakshi

నవీన్‌ కుమార్‌పై చర్యలు తీసుకోవాలంటూ హై కోర్టులో పిటిషన్‌‌

సాక్షి, హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించిన అగ్రిగోల్ట్‌ కేసును మరోసారి విచారించాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు తెలంగాణ హై కోర్టు అగ్రిగోల్డ్‌ కేసు విచారణకు అంగీకరించింది. విచారణ కోసం జస్టిస్ ఎస్ రామచందర్ రావు, జస్టిస్ కోదండరాం బెంచ్ ముందు ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ శ్రీరాం, పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ మెన్షన్ చేశారు. సోమవారం నుంచి మళ్ళీ వాదనలు జరగనున్నాయి. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం తిరిగి చెల్లించేందుకు అనుమతించాలని ఏపీ ఏజీ పిటీషన్ దాఖలు చేసింది. దీనికి న్యాయస్థానం అంగీకరించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల దురాక్రమణ, హైకోర్టు ఆధీనంలో ఉన్న నిధులు పంపిణీ చెయ్యాలని కోరుతూ రమేష్ బాబు అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే సోమవారం నుంచి అగ్రిగోల్డ్ కేసు విచారణ హైకోర్టులో కొనసాగనుంది. (చదవండి: అగ్రిగోల్డ్‌ బాధితుల కన్నీరు తుడిచేలా..)

‘మల్లన్న’ పై చర్యలు తీసుకోవాలి
మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్ కుమార్ పై చర్యలు తీసుకోవాలిని కోరుతూ ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని హై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. క్యూ న్యూస్ అనే సామాజిక మాధ్యమాన్ని మూసేసే విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. క్యూ న్యూస్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న విష ప్రచారం, హద్దులు దాటుతుందని పిటిషన్‌దారు కోర్టుకు తెపారు. క్యూ న్యూస్ ద్వారా ప్రభుత్వాన్ని కించపరుస్తూ నిబంధనలు ఉల్లంగిస్తున్న నవీన్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోర్టుకు తెలిపారు. క్యూ న్యూస్ అనే సామాజిక మాధ్యమం ద్వారా విషప్రచారం చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని కోర్టుకు విన్నవించారు. పిటిషనర్‌ తరఫు వాదనలు విన్న హై కోర్టు తదుపరి విచారణను ఈ నెల 6న చేపట్టనున్నట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు