ఎమ్మెల్సీగా వాణీదేవి ప్రమాణ స్వీకారం

29 Aug, 2021 15:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి ఎమ్మెల్సీగా ఆదివారం ప్రమాణం స్వీకారం చేశారు. శాసనమండలిలో వాణీదేవి చేత ప్రొటెం ఛైర్మన్‌ భూపాల్ రెడ్డి ప్రమాణం చేయించారు. హైదరాబాద్‌-రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వాణీదేవి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

ఈ సందర్భంగా వాణీదేవి మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌కు ఆమెకు కృతఙ్ఞతలు తెలిపారు. ‘‘రాజకీయ వాతావరణంలో పెరిగాం. ప్రజాసేవ చేయడానికి పదవి అక్కర్లేదని అనుకున్నా. కానీ అధికారం ఉంటే ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చని భావించా. అప్పుడే తనకు సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు’’ అని వాణీదేవి అన్నారు.

ఇవీ చదవండి:
మీ ఇష్టం.. గణేష్‌ విగ్రహాల విషయంలో ఆంక్షల్లేవ్‌
శ్మశానంలో ‘డాక్టర్‌’ చదువు

మరిన్ని వార్తలు