వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షునిగా సురేందర్‌ రెడ్డి

27 Jun, 2022 02:39 IST|Sakshi
సురేందర్‌రెడ్డి, పండరినాథ్‌

సాక్షి, హైదరాబాద్‌: విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా వీరన్నగారి సురేందర్‌ రెడ్డి, కార్యదర్శిగా శాలివా హన పండరినాథ్‌ ఎన్నికయ్యారు. ప్రస్తుతం చెన్నైలో సాగుతున్న వీహెచ్‌పీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల సంస్థాగత అంశాలకు సంబంధించి మార్పులు, చేర్పులు చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నట్టు వీహెచ్‌పీ తెలంగాణ అధికార ప్రతినిధి (ప్రచార సహ ప్రముఖ్‌) పగుడాకుల బాలస్వామి ఒక ప్రకటనలో తెలిపారు.

వీరు మూడేళ్ల పా టు ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. గతంలో రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన రామరాజు తెలంగాణ ప్రాంత సలహా సభ్యునిగా, అఖిల భార త మఠ్‌ మందిర్‌ బాధ్యతలు నిర్వహిస్తారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న బండారి రమేష్‌ ఇకపై బెంగళూరు క్షేత్ర సేవా ప్రముఖ్‌గా బాధ్యతలు నిర్వహిస్తారని బాలస్వామి తెలియజేశారు. 

మరిన్ని వార్తలు