Suresh Bandari: ఫార్మాస్యూటికల్‌ శాస్త్రవేత్త సురేశ్‌ బండారి మృతి

7 Sep, 2022 12:43 IST|Sakshi
సురేశ్‌ బండారి (ఫైల్‌)

కోవిడ్‌ అనంతర సమస్యలతో కన్నుమూత

మిసిసిపి యూనివర్సిటీలో విభాగాధిపతి  

హన్మకొండ: హనుమకొండకు చెందిన యువ ఫార్మాస్యూటికల్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సురేష్‌ బండారి కోవిడ్‌ అనంతర సమస్యలతో అమెరికాలోని మిసిసిపి రాష్ట్రంలో మృతి చెందారు. 2017 మే నెలలో అమెరికాలోని మిసిసిపి యూనివర్సిటీలో పోస్ట్‌ డాక్టరల్‌ ఫెలోషిప్‌ను విజయవంతంగా పూర్తి చేసి అదే యూనివర్సిటీలో సీనియర్‌ సైంటిస్ట్‌ హోదా పొందారు. యూనివర్సిటీ యాజమాన్యం అయన ప్రతిభను గుర్తించి ఒక విభాగానికి అధిపతిగా నియమించింది. అతి తక్కువ సమయంలో అధిపతిగా నియమితులైన పిన్నవయస్కుడిగా డాక్టర్‌ సురేష్‌ బండారి పేరుగాంచారు. 

మొత్తం 110 పబ్లికేషన్స్, 2865 సైటేషన్స్‌ (అనులేఖనాలు) రూపొందించడంతో పలు పేటెంట్‌ హక్కులు పొందారు. అంతకుముందు హనుమకొండ విద్యా నగర్‌లోని సెయింట్‌ పీటర్స్‌ ఫార్మసీ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఈ ఏడాది మార్చిలో మొదటిసారి కోవిడ్‌కు గురై త్వరగానే కోలుకున్నారు. కోవిడ్‌ అనంతరం మళ్లీ అస్వస్థతకు గురై అస్పత్రిలో చికిత్స పొందుతూ భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10.30 గంటలకు మిసిసిపిలో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమా రులు ఉన్నారు. సురేష్‌ బండారి తండ్రి మొగిలయ్య యోగా గురువుగా హనుమకొండ నగర ప్రజలకు సుపరిచితుడు. (చదవండి: ప్రాణం తీసిన ‘ప్రేమ’ పంచాయితీ)

మరిన్ని వార్తలు