సూర్యాపేటలో గిరిజనుల భారీ ర్యాలీ 

20 Sep, 2022 01:13 IST|Sakshi

పది శాతం రిజర్వేషన్‌ ప్రకటనపై హర్షం  

భానుపురి (సూర్యాపేట): గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ల పెంపుతోపాటు గిరిజన బంధు, పోడు భూముల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడాన్ని హర్షిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం గిరిజనులు సంబురాలు చేసుకున్నారు. ఖమ్మం క్రాస్‌ రోడ్డులోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి చర్చి కాంపౌండ్‌ రోడ్డు, పొట్టిశ్రీరాములు సెంటర్, పూలసెంటర్, కల్నల్‌ సంతోష్‌బాబు చౌరస్తా మీదుగా రైతుబజార్‌ వద్ద గల అంబేడ్కర్‌ విగ్రహం వరకు డీజే మోతలు, నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహంతో పాటు సీఎం కేసీఆర్, విద్యుత్‌ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.   

మరిన్ని వార్తలు