నిజామాబాద్‌లో వైద్యురాలు అనుమానాస్పద మృతి

13 May, 2022 08:35 IST|Sakshi
ఫైల్‌ఫోటో

సాక్షి, నిజామాబాద్‌: నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గైనిక్ విభాగంలో పీజీ చేస్తున్న డాక్టర్ శ్వేత.. తన ట్రైనింగ్ లో భాగంగా నిన్న రాత్రి రెండు గంటల వరకూ డ్యూటీలోనే ఉన్నారు. ఉదయం తను పడుకున్న గదిలోకి వెళ్లి చూసేసరికి విగతజీవిగా పడి ఉండటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. శ్వేత గుండెపోటుతో మరణించి ఉండొచ్చునని వైద్యులు అంచనా వేస్తున్నారు. అయితే శ్వేతది అనారోగ్యంతో సహజ మరణమా.. లేక, ఇంకేమైనా ఇబ్బందులుండేవా అనేది ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది. డాక్టర్ శ్వేత కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి కాగా.. శ్వేత మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

చదవండి: (మళ్లను పరామర్శించిన సినీనటుడు ఆలీ)

మరిన్ని వార్తలు