ఆ పని చేస్తేనే మహిళలపై వేధింపులు ఆగుతాయ్‌..

2 Mar, 2021 02:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చట్టాలను పకడ్బందీగా అమలు చేసినప్పుడే పని ప్రాంతాల్లో లైంగిక వేధింపులకు కళ్లెం పడుతుందని వివిధ రంగాల మహిళా ప్రముఖులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోలీస్‌ మహిళా భద్రతా విభాగం వార్షికోత్సవం, మరోవైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో సోమవారం వెబినార్‌ ద్వారా వర్క్‌షాప్‌ జరిగింది. ఇందులో ‘పని ప్రాంతాల్లో మహిళలపై వేధింపులు-అధిగమించే మార్గాలు’ అనే అంశంపై వివిధ రంగాల మహిళా ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

అడిషనల్‌ డీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. పని ప్రాంతాల్లో వేధింపులు, గృహహింసకు సంబంధించి అధిక శాతం కేసులు నమోదు కావడం లేదన్నారు. కాగా, ఇటీవల వచ్చిన మీ-టూ ఉద్యమం నేపథ్యంలో పని ప్రాంతాల్లో వేధింపులపై పెద్ద ఎత్తున చర్చ జరిగిందని చెప్పారు. వర్క్‌ప్లేస్‌లో మహిళలపై వేధింపులు, ఇతర విధానాల్లో జరిగే వేధింపులపై నమోదయ్యే కేసుల దర్యాప్తును నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని హిమాచల్‌ ప్రదేశ్‌లోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వీసీ నిష్టా జైస్వాల్‌ వెల్లడించారు. పని ప్రాంతాల్లో వేధింపులను ఎదుర్కోవడం ఎలా అనే అంశంపై రూపొందించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా స్వాతి లక్రా ఆవిష్కరించారు. కార్యక్రమంలో యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ జెండర్‌ విభాగం వైస్‌ చైర్మెన్‌ శృతి ఉపాధ్యాయ్, డీఐజీ సుమతి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు