నేడు సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణం

28 Jun, 2022 03:27 IST|Sakshi

రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు పూర్తి

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్‌లో ఆయనతో గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇప్పటివరకు సీజేగా పనిచేసిన జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ ఢిల్లీకి బదిలీ అయిన విషయం తెలిసిందే.   జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ సీజేగా బాధ్యతలు స్వీక రిస్తే నాలుగేళ్ల కాలంలో ఈ పదవిని చేపట్టిన ఐదో వ్యక్తి అవుతారు.

2019, జనవరి 1న ఏర్పా టైన తెలంగాణ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్, రెండో సీజేగా జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, మూడో సీజేగా జస్టిస్‌ హిమాకోహ్లి, నాలుగో సీజీగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ వ్యవహరించిన విషయం విదితమే. జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌.. గువాహటి ప్రభుత్వ లా కాలేజీ నుంచి ఎల్‌ఎల్‌బీని, గౌహతి వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పట్టా అందుకు న్నారు.

అస్సాం బార్‌ కౌన్సిల్‌లో 1991, మార్చి 20న పేరును నమోదు చేసుకు న్నారు.  పలు రాష్ట్రాల బార్‌ కౌన్సిల్స్‌ లో ఎన్‌రోల్‌ చేసుకోవడమే కాకుండా పలు హైకోర్టుల్లో అడ్వొకేట్‌గా ప్రాక్టీస్‌ చేశారు. ఆదాయపు పన్ను శాఖ స్టాండింగ్‌ కౌన్సి ల్‌గా, సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా చాలా కాలం పనిచేశారు. గౌహతి హైకోర్టులో అడిషనల్‌ జడ్జిగా 2011, అక్టోబర్‌ 17న నియమితులయ్యా రు. 2019, అక్టోబర్‌ 3న బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ రెండేళ్లు జడ్జిగా సేవ లందించారు. 2021, అక్టోబర్‌ 22న సీజేగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కూడా భూయాన్‌ కొనసాగుతున్నారు.  

మరిన్ని వార్తలు