బీరు బాటిల్‌లో సిరంజి 

17 Nov, 2021 08:32 IST|Sakshi

సాక్షి, కుషాయిగూడ(హైదరాబాద్‌): కాప్రాలోని ఓ బార్‌ కు వెళ్లి ఓ వ్యక్తి బీరు ఆర్డర్‌ చేశాడు. బేరర్‌ బీరు తీసుకొచ్చి ఓపెన్‌ చేసి ఆ వ్యక్తి ముందు పెట్టారు. బీరు తాగుతున్న వ్యక్తికి నోటిలో ఏదో తగిలినట్లు అనిపించింది. వెంటనే తేరుకొని చూడగా బీరు బాటిల్‌లో సిరంజిని చూసి కంగు తిన్నా డు.

ఇదేమిటని బార్‌ నిర్వాహకులను నిలదీసి కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం రాత్రి మహాంకాళి బార్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.   

మరిన్ని వార్తలు