ఒకేసారి ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేయొద్దు

27 Jul, 2021 08:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

టీఏఎఫ్‌ఆర్‌సీ 

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థులు ఒకేసారి మొత్తం ఫీజు చెల్లించాలని ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలు ఒత్తిడి చేయొద్దని రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఆదేశించింది. రుసుముల విషయంలో ఏఐసీటీఈ నిబంధనలు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రిన్స్‌స్టన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థిని లావణ్య ఆత్మహత్యపై టీఏఎఫ్‌ఆర్‌సీకి ఏబీవీపీ ఫిర్యాదు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా పద్ధతుల్లో ట్యూషన్‌ ఫీజు చెల్లించడానికి ఏఐసీటీఈ ఆదేశాలున్నప్పటికీ, ఒకే విడతలో ట్యూషన్‌ ఫీజు చెల్లించాలని కాలేజీలు బలవంతం చేస్తున్నాయంది. దీనిపై చర్యలు చేపట్టాలని ఏబీవీపీ కోరింది.  
 

మరిన్ని వార్తలు