వీల్ చైర్‌లోనే విధులు
మునుగోడు: వైకల్యం శరీరానికి తప్ప మనసుకు కాదని నల్లగొండ జిల్లా మునుగోడు తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు నిరూపిస్తున్నారు. ఆయన వీల్ చైర్‌లోనే విధులు నిర్వహిస్తున్నారు. పుట్టుకతోనే దివ్యాంగుడైన ఆయన గతంలో మునుగోడు డీటీగా పనిచేశారు. ఆరు నెలల క్రితం తహసీల్దార్‌గా పదో న్నతి పొంది ఇక్కడే పనిచేస్తున్నారు. సోమవారం మండలంలోని చొల్లేడు గ్రామంలో బృహత్ ప్రకృతివనం ఏర్పాటుకు అధికారులు చేపట్టిన భూ పరిశీలనకు ఆయన వీల్ చైర్‌లో హాజరయ్యారు.