చేపలు, గొర్రెలతో ఉపాధి కల్పిస్తే ఉద్యోగం కాదా? 

8 Oct, 2021 04:11 IST|Sakshi

కుల వృత్తులను కించపరుస్తారా? 

మంత్రి తలసాని ధ్వజం 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో చేపలు, గొర్రెలు, బర్రెలు పంపిణీ చేస్తుంటే, ఆ కులవృత్తులను కించపరిచేలా కొందరు మూర్ఖులు విమర్శలు చేస్తున్నారని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ధ్వజమెత్తారు. చేపలు, గొర్రెలతో ఉపాధి కల్పిస్తే అది ఉద్యోగం కాదా? అని ప్రశ్నించారు. ఏ కులమైనా ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు ముఠా గోపాల్, రేగా కాంతారావు చేప పిల్లల పెంపకంపై అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ ఏడాది 4 లక్షల మెట్రిక్‌ టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని, వీటి విలువ సుమారు రూ.5,600 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు.  

>
మరిన్ని వార్తలు