రెండు రోజుల్లో మరో 10 బస్తీ దవాఖానాల ఏర్పాటు

5 Aug, 2020 13:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : జిల్లా‌లో ఏర్పాటు చేసిన అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లు, బస్తీ దవాఖానాల ద్వారా అందుతున్న వైద్య సేవలు, పనితీరు తదితర అంశాలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాసాబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ శ్వేతా మహంతి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, అడిషనల్‌ కమిషనర్‌ సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. రెండు రోజుల్లో మరో 10 బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తామన్నారు. 85 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లతో పాటు ప్రస్తుతం 95 బస్తీ దవాఖానాల ద్వారా ప్రతిరోజూ  వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకే బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయడం  జరిగిందన్నారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లు, బస్తీ దవాఖానాల లో అవసరమైన సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని వెల్లడించారు.

మరిన్ని వార్తలు