TSRTC Govt Merger Bill 2023: విలీనం బిల్లుకు తమిళిసై గ్రీన్‌సిగ్నల్‌.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

14 Sep, 2023 11:51 IST|Sakshi

టీఎస్‌ఆర్టీసీ బిల్లుకు గవర్నర్‌ గ్రీన్‌సిగ్నల్‌

నెల రోజుల తర్వాత బిల్లుకు తమిళిసై ఆమోదం

10 సిఫార్సులకు ప్రభుత్వం వివరణ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌. తెలంగాణ ప్రభుత్వంలో టీఎస్‌ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదం తెలిపారు. దీంతో, ఆర్టీసీ విలీనం ప్రక్రియకు లైన్‌క్లియర్‌ అయ్యింది. 

వివరాల ప్రకారం.. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో టీఎస్‌ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. ఈ క్రమంలోనే టీఎస్‌ఆ‍ర్టీసీ ఉద్యోగులకు గవర్నర్‌ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. అయితే, బిల్లులో గవర్నర్‌ చేసిన 10 సిఫార్సులకు ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో బిల్లుకు తమిళిసై ఆమోదం తెలిపారు. ఇక, నెల రోజుల తర్వాత బిల్లుకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలపడం విశేషం. 

ఇది కూడా చదవండి: ప్రగతిభవన్‌కు నేతల క్యూ

మరిన్ని వార్తలు