మా నాన్న హత్యకు అతడే సూత్రధారి: తమ్మినేని కృష్ణయ్య కూతురు షాకింగ్‌ కామెంట్స్‌

21 Aug, 2022 12:00 IST|Sakshi

Tammineni Krishnaiah.. సాక్షి, ఖమ్మం: తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ నేత తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్య సంచలనంగా మారింది. ఈ హత్య కేసులో ఏ1గా ఉన్న కోటేశ్వరరావు పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో తన తండ్రి తమ్మినేని కృష్ణయ్య హత్యపై ఆయన కూతురు రజిత షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. తమ్మినేని కూతురు రజిత ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా నాన్నను హత్య చేయించడంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రమే సూత్రదారి. వీరభద్రం ఆదేశాల మేరకు హత్య జరిగింది. హత్య కేసులో సీపీఎం కార్యకర్తలు ఎవరు లేరని వీరభద్రం తప్పుడు మాటలు చెబుతున్నారు. హత్యలో ఉన్న వాళ్లంత సీపీఏం పార్టీకి చెందిన వారే.

మా ఇంట్లో వ్యక్తి చనిపోతే.. మాకు కాకుండా తమ్మినేని వీరభద్రానికి సెక్యూరిటీ ఇవ్వడమేంటి?. మా నాన్న హత్య కేసులో ప్రధాన నిందితులైన కోటేశ్వరరావు, లింగయ్యను దాచిపెట్టింది పోలీసులే. మా గ్రామానికి సెక్యూరిటీ కల్పించి ప్రశాంతమైన వాతావరణం తీసుకురండి. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. మంత్రి కేటీఆర్ స్పందించి మాకు న్యాయం చేయాలి’’ అని కోరారు. 

ఇది కూడా చదవండి: సంచలనంగా మారిన తమ్మినేని మర్డర్‌ కేసు: ఆరుగురు అరెస్ట్‌

మరిన్ని వార్తలు