కీచక టీచర్‌ వికృతక్రీడ.. పదో తరగతి విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడి!

24 Sep, 2022 11:39 IST|Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని పెదగొల్లగూడెం ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే ఆమె పాలిట కీచకుడయ్యాడు. ఓ టీచర్‌.. విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో, ఆందోళన చెందిన బాధితురాలు జరిగిన విషయాన్ని తన పేరెంట్స్‌కు చెప్పింది. 

వివరాల ప్రకారం.. పెదగొల్లగూడెంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో పిచ్చయ్యా అనే గణితం టీచర్‌.. 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా, చాలా రోజులుగా పిచ్చయ్య.. విద్యార్థినిని లైంగికంగా వేధించడంతో ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో, వారు పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థిని పేరెంట్స్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు.. సదరు కీచక టీచర్‌పై పోక్స్‌ చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక, ఈ ఘటనపై స్థానికులు స్పందించి.. టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు