జీవో 317ను సవరించే వరకు ఉద్యమం ఆగదు

13 Feb, 2022 04:56 IST|Sakshi
ధర్నాచౌక్‌లో బైఠాయించిన ఉపాధ్యాయులు 

ఉద్రిక్తంగా టీచర్ల మహాధర్నా

కవాడిగూడ (హైదరాబాద్‌): ప్రభుత్వం జారీ చేసిన జీవో 317ను సవరించాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎన్‌) ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద నిర్వ హించిన మహాధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. టీపీ యూఎస్‌ మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరా కరించడంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు దశలవారీగా ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో మహాధర్నాకు హాజరు కాగా వారిని ఇందిరాపార్కు చౌరస్తాలోనే పోలీసులు అరెస్టు చేశారు.

ఓ దశలో ఉపాధ్యాయులు ధర్నాచౌక్‌ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద బైఠాయించి ప్లకార్డులతో ప్రభుత్వానికి, జీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఉపాధ్యాయులను అరెస్టుచేయడంతో వారి మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహాధర్నాకు మద్దతు తెలపడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్సీ రాం చందర్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉపా ధ్యాయుల సమస్యలు వినడానికి ప్రభుత్వం సిద్ధం గా లేదని కొందరి లబ్ధికోసమే జీవో 317ను తీసు కొచ్చిందని ఆరోపించారు. తెలంగాణ ప్రాంత ఉపా ధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు హను మంతరావు మాట్లాడుతూ 317జీవోను  వెంటనే సవరించాలని డిమాంద్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మల్లికార్జున్, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు