కరోనా కట్టడిపై లేఖ రాసిన వైద్య, లాయర్ల బృందం

25 Apr, 2021 20:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్  చాపకిందనీరులా వ్యాపిస్తూనే ఉంది. రోజు లక్షలాదిగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్, గ‌వ‌ర్న‌ర్ తమిళిసైతో పాటు కేంద్రానికి 50 మంది డాక్ట‌ర్లు, లాయ‌ర్ల‌తో కూడిన బృందం ఆదివారం రోజున లేఖ రాశారు. డాక్టర్ లక్ష్మీ లావణ్య అల్లపాటి నేతృత్వంలో పలు అంశాల‌ను ప్ర‌స్తావించారు.

క‌రోనా కేసుల పాజిటివిటి,మరణాల రేటు లెక్క‌ల‌పై పార‌ద‌ర్శ‌కంగా వెల్ల‌డించాల‌ని వారు లేఖ‌లో పేర్కొన్నారు. బ్లాక్ మార్కెట్ దందాను తావులేకుండా చూడాలని తెలిపారు.రెమిడెసివ‌ర్, ఆక్సిజన్ కొర‌త లేకుండా చూడాల‌న్నారు. క‌రోనా బాధితుల‌ను మెడిసిన్ బయట నుంచి తెప్పించుకోవాల‌ని చెప్తున్న ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయ‌ని తెలిపారు.  అలాంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞ‌ప్తి చేశారు. అంతేకాకుండా కరోనా నిర్ధారణ పరీక్షలో  ఎక్కువ‌గా రాపిడ్ టెస్టుల‌పైనే ఆధారపడుతుండగా, వీటి బదులు  ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య  పెంచాల‌ని విన్నవించారు. ప్రభుత్వం విడుదల చేసే  హెల్త్ బులిటెన్ లో చాలా వరకు  తప్పులు జరుగుతున్నాయన్నారు. ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా ఉండాలంటే వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని పేర్కొనారు.

క‌రోనా కట్టడిలో డీఆర్‌డీవో సహాయం తీసుకోవాలని సూచించారు డాక్ట‌ర్ల‌కు పీపీఈ కిట్లు, మాస్క్‌లు అందుబాటులో లేవని తెలిపారు. ప్రస్తుత సమయంలో  వైద్యులను జాగ్ర‌త్త‌గా చూసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయపడ్డారు. వెంటిలేటర్స్, ఐసీయూ బెడ్ల గురించి ఎప్ప‌టిక‌ప్ప‌డు స‌రైన స‌మాచారం ఇవ్వాలని కోరారు.

చదవండి: కోవిడ్‌ ఎఫెక్ట్‌.. ఇక అంబులెన్స్‌ సేవలు ఫ్రీ..

మరిన్ని వార్తలు