తెలంగాణ కరోనా బులెటిన్‌: కొత్త కేసులు ఎన్నంటే..

11 May, 2021 19:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఒక్క రోజులో 75,289 మందికి కరోనా పరీక్షలు చేయగా వాటిలో 4,801 పాజిటివ్‌ తేలాయి. ఇక 32 మంది తాజాగా కరోనాతో మృతి చెందారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 756 పాజిటివ్‌ కేసులు తేలాయి. అనంతరం మేడ్చల్‌ జిల్లాలో 327, రంగారెడ్డి జిల్లాలో 325 కేసులు వెలుగులోకి వచ్చాయి.

కరోనా నుంచి కోలుకుని 24 గంటల్లో 7,430 మంది డిశ్చార్జయ్యారు. వీరితో కలిపి ఇప్పటివరకు 4,44,049 మంది డిశ్చార్జ్ పొందారు. కొత్త మరణాలతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 2,803. ప్రస్తుతం 60,136 యాక్టివ్‌ కేసులు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,37,54,216 మందికి కరోనా పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులు 5,06,988. ప్రస్తుతం కరోనా కట్టడికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు రేపటి నుంచి లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌తో కరోనా ఉధృతికి కట్టడి ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

చదవండి: కరోనా ఫండ్‌తో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా

చదవండి: తెలంగాణతో పాటు లాక్‌డౌన్‌ విధించిన రాష్ట్రాలు ఇవే!

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు