పోలీసు పోస్టులకు 12.7 లక్షల దరఖాస్తులు 

27 May, 2022 02:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసిన వివిధ విభాగాల్లోని ఉద్యోగాల భర్తీకి భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖ, రవాణా, అబ్కారీ విభాగాల్లోని సబ్‌ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్‌ హోదాతో ఉన్న 17 వేల పైచిలుకు పోస్టులకు రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ ఇచ్చింది.

ఈ మొత్తం ఉద్యోగాలకు ఏడు లక్షల మంది అభ్యర్థులు 12.7 లక్షల దరఖాస్తులను దాఖలు చేసినట్టు రిక్రూట్‌మెంట్‌ బోర్డు వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ సారి దాదాపు 1.3 లక్షల మంది మహిళా అభ్యర్థులు 2.8 లక్షల దరఖాస్తులు దాఖలు చేసినట్టు బోర్డు వర్గాలు వెల్లడించాయి.  

మరిన్ని వార్తలు