సచివాలయంలో 120 మందికి పదోన్నతులు! 

31 Aug, 2021 02:17 IST|Sakshi

త్వరలో ఉత్తర్వులు: ఉద్యోగ సంఘాలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర సచివాలయంలో దాదాపు 120 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు రంగం సిద్ధమైంది. త్వరలో ఈ మేరకు ఉత్తర్వులు రానున్నాయని ఉద్యోగ వర్గాలు తెలిపాయి. 59 మంది అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లకు సెక్షన్‌ ఆఫీసర్లుగా, 33 మంది సెక్షన్‌ అధికారులకు  సహాయ కార్యదర్శులుగా, 20 మంది సహాయ కార్యదర్శులకు డిప్యూటీ కార్యదర్శులుగా, 8 మంది డిప్యూటీ కార్యదర్శులకు జాయింట్‌ సెక్రెటరీలుగా, నలుగురు జాయింట్‌ సెక్రెటరీలకు  అదనపు కార్యదర్శులుగా పదోన్నతి కల్పించే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్‌ ఆమోదం లభించిన వెంటనే ఉత్తర్వులు జారీ కానున్నాయని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. 

మరిన్ని వార్తలు