‘బ్రిటన్‌’ భయం!

26 Dec, 2020 01:01 IST|Sakshi

అక్కడి నుంచి వచ్చిన వారిలో మొత్తం 16 మందికి వైరస్‌

రెండ్రోజుల్లో కొత్త రకం వైరస్‌ ఎందరికి ఉందో నిర్ధారణ

క్వారంటైన్‌లో వారి కుటుంబ సభ్యులు 76 మంది కూడా..

సాక్షి, హైదరాబాద్‌: బ్రిటన్‌ నుంచి వచ్చిన వారిలో కరోనా పాజిటివ్‌గా తేలిన వారి సంఖ్య 16కు చేరింది. మొదట 7 కేసులుంటే, ఇప్పుడు రెండింతలకు పైగా కేసులు పెరిగాయి. వారిలో బ్రిటన్‌కు చెందిన కొత్త రకం వైరస్‌ ఉందా లేదా అనేది తెలుసుకునేందుకు జీనోమ్‌ సీక్వెన్సీ చేయ నున్నారు. అందుకోసం హైదరాబాద్‌ సీసీ ఎంబీకి శాంపిళ్లను పంపించినట్లు ప్రజా రోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 16 మందిని వివిధ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులో ఉంచి నట్లు శ్రీనివాసరావు తెలిపారు. వీరిలో విద్యార్థులు, ఉద్యోగులే ఎక్కువున్నట్లు వివరించారు. వారితో అతి సన్నిహితంగా మెలిగిన కుటుంబ సభ్యులు, స్నేహితు లను 76 మందిని గుర్తించామన్నారు. వీరిని క్వారం టైన్‌లో ఉంచి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామన్నారు.  తమ పర్యవేక్షణలో 92 మంది ఉన్నట్లు తెలిపారు. 

1,200 మందిలో 926 మందికి టెస్టులు..
‘ఇటు యూకే నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నాం. ఈ నెల 9 నుంచి ఇప్పటివరకు 1,200 మంది యూకే నుంచి తెలంగాణకు రాగా.. వారిలో 926 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించాం. ఇప్పటివరకు పాజిటివ్‌ వచ్చిన 16 మందిలో హైదరాబాద్‌కు చెందిన నలుగురు, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా నుంచి నలుగురు, జగి త్యాల జిల్లాకు చెందిన ఇద్దరు, మంచిర్యాల, నల్లగొండ, రంగా రెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌ అర్బన్‌ జిల్లా నుంచి ఒక్కొక్కరు పాజి టివ్‌గా ఉన్నట్లు ఫలితాలు వచ్చాయి. జీనోమ్‌ సీక్వెన్సీ కోసం సీసీఎంబీకి పంపిన శాంపిళ్ల ఫలితాలు మరో రెండ్రోజుల్లో వస్తా యని ఆశిస్తున్నాం. కరోనా వైరస్‌ కొత్త స్ట్రెయిన్‌ వచ్చిన నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్‌ విధా నాన్ని అవలంబిస్తున్నాం. చదవండి: (న్యూ ఇయర్‌ వేడుకలపై నిషేధం)

ఇప్పటి వరకు ప్రభుత్వ చర్యలు, ప్రజల సహకారం వల్ల వైరస్‌ వ్యాప్తి, మరణాల సంఖ్యను అదుపులో ఉంచగలిగాం. మున్ముందు కూ డా ప్రజలు సహకరించాలి. కొత్త రకం వైరస్‌తో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ అప్ర మత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలి.. డిసెంబర్‌ 9వ తేదీ తర్వాత యూకే నుంచి రాష్ట్రానికి నేరుగా లేదా యూకే మీదుగా ప్రయాణించి  వచ్చిన వారుంటే వివరా లను 040–24651119కు ఫోన్‌ చేసి లేదా 9154170960 నంబర్‌కు వాట్సాప్‌ చేసి తెలపాలని కోరుతున్నాం.  అలా ఎవరైనా ఉంటే సిబ్బందే వారి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు చేస్తుంది’అని శ్రీనివాస రావు తెలిపారు. ఇటు వివిధ జిల్లాల్లో ఉన్న బ్రిట న్‌కు చెందిన పాజిటివ్‌ వ్యక్తులను హైదరా బాద్‌కు పంపిస్తామని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు