తెలంగాణ: నకిలీ సర్టిఫికెట్స్‌తో 230 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు

14 Jun, 2022 13:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: కాంట్రాక్ట్‌ జూనియర్‌ లెక్చర్లలో 230 మంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందినట్లు తెలంగాణ ఆర్థికశాఖ అధికారులు గుర్తించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో వివిధ శాఖల్లోని కాంట్రాక్ట్‌ ఉద్యోగుల వివారలను సేకరించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు 11 వేల మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే  వారి వివరాలు పంపించాలని ఆయా శాఖలను  ఆర్థిక శాఖ కోరింది. దీంతో తమ తమ శాఖల్లోని ఉద్యోగుల వివరాలను అధికారులు సేకరించి,  వారి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేశారు.

ఈ క్రమంలో అనేక అవకతవకలు వెలుగు చూశాయి. 230 మంది కాంట్రాక్ట్‌ లెక్చర్ర్లు నకిలీలుగా తేలింది.  మరికొంతమంది మంజూరు లేని పోస్టులలోపనిచేస్తున్నట్లు, క్వాలిఫికేషన్‌ లేకున్నా కాంట్రాక్ట్‌ లెక్చరర్లుగా జాయిన్‌ అయినట్లు బయటపడింది.   ఇప్పటి వరకు 18 మంది డిగ్రీ లెక్చర్లు, ఆరుగురు పాలిటెక్నిక్‌ లెక్చరర్లకు అధికారులు షోకాజ్‌ నోటీసులు అందించారు. మరి నకిలీ లెక్చరర్ల  విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.
చదవండి: బండి సంజయ్‌కు హయత్‌ నగర్‌ పోలీసులు నోటీసులు

మరిన్ని వార్తలు