ఆర్టీసీ బస్సు బోల్తా

13 Nov, 2021 02:02 IST|Sakshi

కండక్టర్‌సహా 25 మందికి తీవ్రగాయాలు

వికారాబాద్‌ జిల్లాలో ఘటన

మర్పల్లి/ ఖమ్మం మయూరిసెంటర్‌: ఓ ఆర్టీసీ అద్దె బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో కండక్టర్‌సహా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా మర్పల్లి సమీపంలో శుక్రవారం జరిగింది. సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు 70 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో మర్పల్లి మీదుగా తాండూరుకు వెళుతోంది. వేగంగా ఉన్న బస్సు మర్పల్లి సమీపంలోని గుర్రంగట్టు తండా మూల మలుపు వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది.

దీంతో భయాం దోళనకు గురైన ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. కొందరు బస్సు అద్దాలను పగులగొట్టి బయట కు వచ్చారు. కండక్టర్‌ రాజమణి తలకు బలమైన గాయం కాగా, ఓ ప్రయాణికురాలి కం టికి తీవ్ర గాయం అయ్యింది. మరొకరికి కాళ్లూ చే తులు విరిగాయి. క్షతగాత్రులను మర్పల్లి ఎస్‌ఐ వెంకట శ్రీను తన వాహనం, మరో ఆటోలో మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రం గా గాయపడిన 10 మందిని మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మరో 15 మందిని హైదరాబాద్‌కు తరలించినట్లు వైద్యులు తెలిపారు. బస్సు డ్రైవర్‌ భుజంగం నిర్లక్షమే ప్రమాదానికి కారణమని ఎస్‌ఐ వెంకట శ్రీను తెలిపారు. బస్సు వేగంగా నడపడం వల్లే మూలమలుపు వద్ద అదుపు తప్పిందన్నారు.

మంత్రులు పువ్వాడ, సబితారెడ్డి ఆరా
ప్రమాదం ఘటనపై మంత్రులు సబితారెడ్డి, పు వ్వాడ అజయ్‌ అధికారులను ఆరా తీశారు. క్షత గాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని వికారాబాద్, సంగారెడ్డి ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్లను పువ్వాడ ఆదేశించారు.  

మరిన్ని వార్తలు