మరో 25 మంది విద్యార్థినులకు అస్వస్థత

1 Dec, 2021 03:14 IST|Sakshi
అస్వస్థతకు లోనైన విద్యార్థినులు   

48 కరోనా కేసులు నమోదైన సంగారెడ్డి గురుకులంలో ఘటన

పటాన్‌చెరు టౌన్‌: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగిలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల విద్యాలయం కరోనా కలకలం నుంచి తేరుకోక ముందే మరో 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు లోనైన ముగ్గురిని చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 48 మంది ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

అయితే కోవిడ్‌ టెస్టులో నెగెటివ్‌ వచ్చిన విద్యార్థినుల్లో మంగళవారం 25 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థ తకు లోనయ్యారు. సమాచారం తెలుసుకున్న వైద్యాధికారులు వారికి చికిత్స చేశారు. వారికి ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయించాలని డాక్టర్లు సూచించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ఓ డాక్టర్, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని ఉన్నతాధికారులు చెప్పారు.  

కరోనా సోకిన విద్యార్థినుల ఇంటిబాట  
కరోనా బారిన పడిన విద్యార్థినులను గురుకులంలో ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స చేయిస్తున్న విషయం తెలిసిందే. అయితే 47 మంది విద్యార్థినుల్లో కొందరిని వారి తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లారు.  

మరిన్ని వార్తలు