పోలవరం ముంపుపై పరిశీలన

11 Nov, 2022 01:10 IST|Sakshi

ఇరు రాష్ట్రాల ఇరిగేషన్‌ అధికారుల పర్యటన 

బూర్గంపాడు/భద్రాచలం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురయ్యే ప్రాంతాలను గురువారం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణలోని బూర్గంపాడు, అశ్వా పురం, భద్రాచలం మండలాల్లోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతాయని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై కేంద్ర జలవనరుల సంఘం స్పందించింది.

ఆయా ప్రాంతాలను పరిశీలించి నివేదిక అందించాలని ఇరు రాష్ట్రాల అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల అధికారులు భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం మండలాల్లో పర్యటించి వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో పర్యటించారు. ఈ ఏడాది వచ్చిన వరదల సమయంలో కిన్నెరసాని, ముర్రేడు, పెదవాగు, ఎదుర్లవాగులో వరద తీవ్రత ఎంతమేర వచ్చిందనే వివరాలు సేకరించారు.  త్వరలోనే మరోసారి సర్వే నిర్వహిస్తామని తెలిపారు. ఈ బృందంలో తెలంగాణ ఇరిగేషన్‌ ఈఎన్‌సీ నాగేంద్ర కుమార్, సీఈ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఈ వెంకటే శ్వరరెడ్డి, ఏపీ ఇరిగేషన్‌ ఈఈ రమ ణ, డీఈఈలు పుల్లారావు, దామోదర్‌ ఉన్నారు. 

మరిన్ని వార్తలు