తెలంగాణ: 50వేల వైద్య నియామకాలకు నోటిఫికేషన్‌

11 May, 2021 02:04 IST|Sakshi

ఈనెల 22వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ..

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు తాత్కాలిక పద్ధ తిలో వైద్య నిపుణులను నియమించేం దుకు ప్రభుత్వం సోమవారం నోటిఫికే షన్‌ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 50 వేలకుపైగా డాక్టర్లు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ తదితర విభాగాల్లో తాత్కాలిక పద్ధతిలో నిపుణులను నియమించుకోవాలని ఆదివారం సీఎం కేసీఆర్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఆసక్తిగల నిపుణులు ఆన్‌లైన్‌ ద్వారా ఈనెల 22లోగా దరఖాస్తులు సమర్పించాలి. కరోనా సమయంలో సేవలు అందించినందుకు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సమ యంలో వారికి వెయిటేజీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం పేర్కొన్నారు. కాగా, తాజాగా వైద్య, ఆరోగ్య శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఎంతమందిని నియమించు కుంటామనే వివరాలను ప్రస్తావించలేదు. కేటగిరీల వారీగా ఇచ్చే వేతనాలపై మాత్రం స్పష్టతనిచ్చింది.

కేటగిరీ                                  వేతనం(రూ.లలో)
మెడికల్‌ ఆఫీసర్‌–స్పెషలైజ్డ్‌    1,00,000
మెడికల్‌ ఆఫీసర్‌–ఎంబీబీఎస్‌    40,000
మెడికల్‌ ఆఫీసర్‌–ఆయుష్‌         35,000
స్టాఫ్‌నర్స్‌                                  23,000
ల్యాబ్‌ టెక్నీషియన్‌                 17,000  

చదవండి: (తెలంగాణలో లాక్‌డౌన్‌?.. 15వ తేదీ నుంచి అమల్లోకి..!) 

మరిన్ని వార్తలు