ఉద్యోగాల ప్రకటనతో కాంగ్రెస్‌, బీజేపీల్లో వణుకు పుడుతోంది: హరీష్‌ రావు

9 Mar, 2022 15:31 IST|Sakshi

అప్‌డేట్స్‌:

►సీఎం కేసీర్‌ చేసిన ఉద్యోగాల ప్రకటనతో కాంగ్రెస్‌, బీజేపీల్లో వణుకు పడుతోందని ఆర్థికశాఖ మంత్రి హరీష్‌ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 60 ఏళ్లలో కాంగ్రెస్‌ చేయలేనిది కేసీఆర్‌ చేసి చూపించారని, తెలంగాణలోని పల్లెలు అత్యద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో గ్రామ స్వరాజ్యం సాకారం అయ్యిందన్నారు. కాంగ్రెస్‌ హయాలంలో ఒక్క గ్రామమైనా అభివృద్ధి చెందిందా అని హరీష్‌ రావు ప్రశ్నించారు. ప్రభుత్వంపై విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలన్నారు. గ్రామాభివృద్ధిపై చర్చకు కాంగ్రెస్‌ నేతలు సిద్ధమా అని ప్రశ్నించారు. 

►బడ్జెట్‌ ప్రకటనలకే పరిమితం అవుతోందని కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలు తీర్చేలా అమలు జరగడం లేదని మండిపడ్డారు. ప్రతీ ఏడాది బడ్జెట్‌పెంచుకుంటూ పోతున్నారని, అమలు విషయంలో మాత్రం కోతలు పెడుతూ వస్తున్నారని విమర్శించారు. పెరిగిన ధరలను బట్టి డబుల్‌ బెడ్రూం ఇళ్లకు రూ. 8 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అయితే 8 ఏళ్లలో గజం స్థలం కూడా పేదలకు ఇవ్వలేదని, పేదలు ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. కార్పొరేట్‌ బడ్జెట్‌ కాదన్నారు.. బడ్జెట్‌ ద్వారా పేదలకు ఏం దక్కిందని ప్రశ్నించారు.

మల్టీజోన్‌ వారీగా మొత్తం ఖాళీలు: 13, 170
► మల్టీ జోన్‌-1: 6,800
► మల్టీ జోన్‌-2: 6,370

ఉద్యోగ అభ్యర్థుల వయోపరిమితి వివరాలు:
► ఉద్యోగ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి పెంచిన ప్రభుత్వం
► ఓసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు
►  ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల వయోపరిమితి 49 ఏళ్లు
►  దివ్యాంగ అభ్యర్థుల వయోపరిమితి 54 ఏళ్లు
►  ఎక్స్‌ సర్వీస్‌మెన్లకు వయోపరిమితి 47 ఏళ్లు
► హోంశాఖలో వయోపరిమితి మినహాయింపు లేదు

జోన్ల వారీగా ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీలు (18,866)
జోన్‌-1 కాళేశ్వరం: ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు. 1,630
జోన్‌-2 బాసర:
ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల. - 2,328
జోన్‌-3 రాజన్న-సిరిసిల్ల: కరీంనగర్‌, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్‌, కామారెడ్డి. - 2,403
జోన్‌-4 భద్రాద్రి: కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ.  - 2,858
జోన్‌-5 యాదాద్రి: సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగామ.  2,160
జోన్‌-6 చార్మినార్‌: మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌. - 5,297
జోన్‌-7 జోగులాంబ: మహబూబ్‌నగర్‌, నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్‌ కర్నూలు. - 2,190

► వైద్య ఆరోగ్య శాఖ- 12,755, బీసీ సంక్షేమ శాఖ- 4,311
►  నీటిపారుదల శాఖ-3,692, ఎస్సీ సంక్షేమ శాఖ-2,879
► ట్రైబల్‌ వెల్ఫేర్‌-2,399 పోస్టుల భర్తీ
► రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 7వేల కోట్ల అదనపు భారం పడనుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

►  ఉన్నత విద్యాశాఖ -7,878, రెవిన్యూ శాఖ-3,560 
►  పోలీసు శాఖలో 18,344 పోస్టుల భర్తీ 
►  విద్యాశాఖలో 13,086 పోస్టుల భర్తీ 

► అన్ని పోస్టుల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్‌
► అటెండర్‌ నుంచి ఆర్డీవో పోస్టు వరకు స్థానికులకే వర్తింపు 
► 5 శాతం ఓపెన్‌ కోటలో పోటీ పడొచ్చు: సీఎం కేసీఆర్‌

11,103 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రైగ్యులరైజ్‌: సీఎం కేసీఆర్‌ 
విద్యాశాఖలో 25 నుంచి 30వేల వరకు పోస్టులు 

తెలంగాణలో ఉద్యోగ ఖాళీలు 91,142 
► తెలంగాణలో ఉద్యోగ ఖాళీలు 91,142 ఉన్నాయని.. వాటికి నేటి నుంచి నోటిఫికేషన్లు వస్తాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 

► జోనల్‌ స్థాయిలో 18,866 ఉద్యోగాల ఖాళీలు, మల్టీజోన్‌ స్థాయిలో 13,170 ఉద్యోగాల ఖాళీలు, ఇతర కేటగిరీ, వర్సిటీల్లో 8174  ఉద్యోగాల ఖాళీలు నోటిఫైచేశామని చెప్పారు. తెలంగాణలో గుర్తించిన ఖాళీలు 80,039 అని కేసీఆర్‌ తెలిపారు. ఇప్పటి వరకు లక్షా 30వేల పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. 

► గ్రూప్‌-1పోస్టులు 503, గ్రూప్‌-2 పోస్టులు 582, గ్రూప్‌-3 పోస్టులు 1373, గ్రూప్‌-4 పోస్టులు 9168, జిల్లా స్థాయిలో 39829 ఉద్యోగాల ఖాళీలు, లక్ష 56 వేల ఉద్యోగాలు నోటిఫై చేశామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 

► తెలంగాణ ఏర్పాటు చరిత్రలో ప్రత్యేక ఘట్టమని సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు. రాజకీయాలంటే వేరే పార్టీలకు గేమ్‌.. టీఆర్‌ఎస్‌కు ఒక టాస్క్‌ అని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఉద్యమం చేపట్టామని చెప్పారు.

► తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం విద్యార్థులు ఉద్యమం చేశారని తెలిపారు. ఉద్యమ సమయంలో తాను పోలీసు లాఠీ దెబ్బలు తిన్నానని చెప్పారు. 

రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తు‍న్నారు.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అసెంబ్లీకి చేరుకున్నారు. కాసేపట్లో అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేయనున్నారు. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగులకు శుభవార్త వినిపిస్తానన్నారు. లక్ష ఉద్యోగాలకు పైగా ఖాళీల భర్తీ ప్రకటించే అవకాశం ఉంది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌ 2022–23 రెండోరోజు సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 7న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన తర్వాత.. స్పీకర్‌ సభను బుధవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మంగళవారం సమావేశాలకు విరామం ప్రకటించారు. కాగా బుధవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే సీఎం కె.చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చేస్తారు.

అనంతరం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ చేపట్టకుండానే నేరుగా బడ్జెట్‌పై సాధారణ చర్చ ప్రారంభం అవుతుంది. ఇలావుండగా బిజినెస్‌ అడ్వైజరీ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను సోమవారం సభకు సమర్పిస్తారు.

మరిన్ని వార్తలు