TS Assembly Session 2021: తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

8 Oct, 2021 18:05 IST|Sakshi

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. 7 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు సాగాయి.

కేంద్రం దగ్గర ఉన్నదేందీ.. మాకు ఇచ్చేదేంది?
ప్రపంచంలో ఎవరూ వాళ్ల జేబుల్లోంచి తీసి సంక్షేమ కార్యక్రమాలు చేయరని సీఎం కేసీఆర్‌ అన్నారు. అల్పాదాయ వర్గాలకు భారీగా నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ‘తెలంగాణలో సంక్షేమం’పై జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ కేంద్రం తమ కంటే ఎక్కువగానే అప్పులు చేసిందన్నారు. కేంద్రం దగ్గర ఉన్నదేందీ..? మాకు ఇచ్చేదేంది? అంటూ కేసీఆర్‌ ప్రశ్నించారు. ‘‘కేంద్రం నిధులు దారి మళ్లుతున్నాయని విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.2 లక్షల 74 వేల కోట్లు వెళ్లాయి. మరి కేంద్రం నుంచి తెలంగాణకు వస్తున్న నిధులు ఎన్ని?. కేంద్రం నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి రాలేదని’’ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

తెలంగాణలో ఐటీ అభివృద్ధి చెందుతోందని.. పారిశ్రామిక రంగంలో అద్భుతాలు జరుగుతున్నాయన్నారు. అన్ని జిల్లా పరిషత్‌లు మాకే వచ్చాయన్నారు. స్థానిక సంస్థల్లో టీఆర్‌ఎస్‌ గెలిస్తేనే అభివృద్ధి అన్నారు. 2018లో ప్రజలు మాకు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని.. ఏ ఎన్నిక జరిగినా టీఆర్‌ఎస్‌ గెలుస్తూ వచ్చిందని సీఎం అన్నారు. తెలంగాణలో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరుస్తోందని.. బోనాల పండుగకు రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఆధ్యాత్మికంగా అన్ని వర్గాలను గౌరవిస్తామని కొందరు చౌకబారు విమర్శలు చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. ఉద‌యం 10 గంట‌ల‌కు శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో వరద నష్టం నిధులు ఇంకా విడుదల చేయలేదన్నారు. పంట నష్టంపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతుందని, గోదావరి ఉధృతి వల్లే పంటలు మునిగాయన్నారు. 

పంట నష్టంపై కేంద్రానికి నివేదిక పంపినా నిధులు ఇవ్వలేదని విమర్శిచారు. కేంద్రం ఆలస్యం చేయడం వల్లే ఇబ్బందులు తలెత్తాయన్నారు. స్వామినాథన్‌ నివేదికలను కూడా కేంద్ర పట్టించుకోలేదని అన్నారు. దేశంలో పంటల బీమా విధాన శాస్త్రీయంగా లేదని, అందుకే రైతులకు న్యాయం జరగడం లేదని మండిపడ్డారు.
చదవండి: KCR: రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారు

మరిన్ని వార్తలు