అసెంబ్లీ స్పీకర్‌కు కరోనా

25 Nov, 2021 11:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచా రం శ్రీనివాస్‌రెడ్డి కరోనా లక్షణాలతో హైదరా బాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొం దుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. రెగ్యులర్‌ మెడికల్‌ టెస్టుల్లో భాగంగా బుధవారం రాత్రి చేసిన వైద్య పరీక్షలో స్పీకర్‌కు కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ, వైద్యుల సూచ నల మేరకు గచ్చిబౌలి ఏఐసీ ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 21న హైదరాబాద్‌లో స్పీకర్‌ మనవరాలి వివాహం జరగగా, ఏపీ, తెలం గాణ ముఖ్యమంత్రులతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. సీటీ స్కాన్‌లో వైరస్‌ ఆనవాళ్లు కనిపించలేదని.. ఆయనకు మరిన్ని వైద్య పరీక్షలు చేసి డిశ్చార్జి చేసే అవకాశం ఉందని తెలిసింది.  

మరిన్ని వార్తలు