28 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

7 Sep, 2020 16:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ‌శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత‌న భేటీఅయిన బిజినెస్ అడ్వైజ‌రీ క‌మిటీ (బీఏసీ) స‌మావేశ‌ం ముగిసింది. సభ నిర్వహణ, అజెండా తయారీపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 28 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 10, 11 తేదీల్లో అసెంబ్లీలో కీలకమైన రెవెన్యూ చట్టంపై చర్చచేపట్టనున్నారు. అలాగే భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టనుంది. సమావేశాలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విపక్ష సభ్యులను కోరారు. (తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!)

మీడియా పాయింట్ ఎత్తివేయడంపై సమావేశంలో గరం గరం చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మీడియా పాయింట్ ఎత్తివేయడంపై భట్టి విక్రమార్క అభ్యంతరం తెలిపారు. కోవిడ్ నేపథ్యంలోనే మీడియా పాయింట్ అనుమతించలేదని సీఎం కేసీఆర్ వివరించారు. కాగా వివిధ కారణాల దృష్ట్యా ఈ నెల 12, 13, 20, 27 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ప్రకటించారు. కాగా సోమవారం నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు