Bathukamma: పోయిరా బతుకమ్మ...మళ్లీ రా బతుకమ్మ..ఉయ్యాలో 

14 Oct, 2021 10:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ కోలాహలం సందడి సందడిగా కొనసాగుతోంది. తీరొక్క పూలతో మహిళలంతా వీధివీధినా బతుకమ్మను పేర్చి ఆడిపాడే వేడుక తుది దశకు చేరుకుంది. మహాలయ అమావాస్య నుంచి రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, తొమ్మిది రోజులు, నైవేద్యాలు, తొమ్మిది రూపాల్లో అమ్మవారిని పూజిస్తారు. చివరి రోజైన సద్దుల బతుకమ్మతో ఈ సంబరాలు ముగుస్తాయి.  పోయిరా బతుకమ్మ ఉయ్యాలో ..మళ్లీ రా బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడబిడ్డలు సద్దుల బతుకమ్మ నాడు ఆ గౌరమ్మ తల్లికి ఘనంగా వీడ్కోలు పలుకుతారు.

పెరుగన్నం, చింతపండు పులిహోర, సత్తుపిండి, కొబ్బరన్నం, నువ్వులన్నం ఇలా ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి  గౌరమ్మకు నైవేద్యాన్ని సమర్పిస్తారు.  చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు చెరువులో నిమజ్జనం చేయడంతోఈ వేడుకలు ముగుస్తాయి. తొమ్మిది రోజుల  ఉత్సాహాన్ని ఏడాదంతా నింపుకుంటారు ఆడబిడ్డలు.

మరిన్ని వార్తలు