అవయవదానం ఉద్యమంలా సాగాలి

28 Nov, 2022 02:15 IST|Sakshi
అవయవదాత కుటుంబ సభ్యులను సన్మానిస్తున్న మంత్రి హరీశ్‌రావు  

ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది: హరీశ్‌రావు 

గాంధీ ఆస్పత్రి: ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి పునర్జన్మ ప్రసాదించే అవయవదానం ఉద్యమంలా కొనసాగాలని, ఆత్మీయులను కోల్పోయిన బాధలో ఉండి కూడా దానం చేసేందుకు అంగీకరించడం నిజంగా చాలా గొప్ప విషయమని వైద్య ఆరోగ్య­శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కాలేజీ వివేకానంద ఆడి­టో­రియంలో జీవన్‌దాన్‌ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో అవయవదాతల కుటుంబసభ్యులను సన్మానించి ప్రశంసాప­త్రాలను అందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. బ్రెయిన్‌డెడ్‌ అయినవారు భౌతికంగా మనమధ్య లేకున్నా, దానంతో ప్రాణభిక్ష పొందిన మరో ఎనిమిది మంది వారి ప్రతిరూపాలేనని అన్నారు. బ్రెయిన్‌డెడ్‌ అయి అవయవదానం చేసిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని, పిల్లల చదువు, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుల్లో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. 

అవయవదానంలో తెలంగాణ చాంపియన్‌
అవయవదానంలో తెలంగాణ చాంపియన్‌గా నిలుస్తోందని, ఈ ఏడాది బ్రెయిన్‌డెడ్‌ అయిన 179 మంది అవయవాలను దానం చేయగా ఆయా అవయవాలను 1432 మందికి ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసి పునర్జన్మ ప్రసాదించామన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలోనే దాతలు ఎక్కువన్నారు. బ్రెయిన్‌డెడ్‌ అయిన వారిని లేదా వారి నుంచి సేకరించిన అవయవాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు హెలికాప్టర్‌ సేవలు విని యోగించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ఎనిమిదో అంతస్తులో  అత్యంత అధునా­తమైన ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ బ్లాక్‌ ఏర్పాటు ­చేస్తున్నామని, టెండరు ప్రక్రియ పూర్తయిందని, ఆరు నెలల్లో అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తు­న్నామన్నారు. కోర్టు వివా దాల తర్వాత  ఉస్మానియా ఆస్ప­త్రిలో కూడా ఇటు వంటి బ్లాక్‌ రూపొందిస్తామ­న్నారు. కార్యక్రమంలో జీవన్‌దాన్‌ ఇన్‌చార్జి స్వర్ణల­త, డీఎంఈ రమేష్‌రెడ్డి, వైద్యవిధాన పరిషత్‌ కమి­షనర్‌ అజయ్‌కుమార్, గాంధీ, ఉస్మానియా సూప­రింటెండెంట్లు రాజా రావు, నాగేందర్, నిమ్స్‌ ఇన్‌చార్జి్జ బీరప్ప, వైద్యులు మంజూష, మనీషా, కిరణ్మయి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు