మహిళా మావోయిస్టుల జీవిత చరిత్రపై పుస్తకం 

9 Dec, 2021 03:53 IST|Sakshi
మావోయిస్టులు ప్రచురించిన పుస్తకం కవర్‌ పేజీ

మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌ వెల్లడి  

చర్ల: ప్రజాయుద్ధంలో 2005 నుంచి 2021 వరకు అసువులుబాసిన మహిళా అమరవీరుల జీవిత చరిత్రపై మావోయిస్టులు పుస్తకాన్ని తెచ్చారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ బుధవారం ఓ లేఖ ద్వారా వెల్లడించారు. 178 పేజీల పుస్తకం పీడీఎఫ్‌ను కూడా విడుదల చేశారు.

దశాబ్దాల పోరు చరిత్రలో ఎందరో మహిళా గెరిల్లాలు ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి ప్రజాఉద్యమ చరిత్రలో తమ చెరగని ముద్రవేశారని జగన్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. త్యాగధనుల జీవిత చరిత్రలు సమాజానికి తరగని గనిలాంటివని భావిస్తూ ఈ పుస్తకాన్ని తెచ్చామని చెప్పారు. గతంలోనూ 2005లో మహిళా మావోయిస్టుల అమరులపై ఎన్‌టీ ఎస్‌జడ్‌సీ (ఉత్తర తెలంగాణ స్పెషల్‌ జోనల్‌ కమిటీ) ఒక పుస్తకాన్ని ప్రచురించగా, ఇప్పుడు రెండో పుస్తకాన్ని వెలువరించినట్లు జగన్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు