సర్కారు చేతకానితనం వల్లే అత్యాచారాలు: సంజయ్‌

8 Jun, 2022 02:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ బాలిక గ్యాంగ్‌రేప్‌ ఘటనలో నేరం చేసిన వాళ్లపై కేసులు నమోదు చేయని పోలీసులు, న్యాయం చేయాలంటూ ఉద్యమిస్తున్న తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు ఎమ్మె ల్యే రఘునందన్‌రావుపై కేసులు పెట్టడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. ఈ తరహా ఘట నలు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిం చాయ నడానికి నిదర్శనమని, దీనికి ముమ్మాటికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేతకాని తనమే కారణ మని ఆయన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.

నిందితులకు సంబంధించిన ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా దోషులను అరెస్ట్‌ చేయడంలో పోలీసులు ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. టీఆర్‌ ఎస్, మజ్లిస్‌ నేతల ప్రమేయం ఉన్నందునే ప్రభుత్వం కేసును తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ‘నేరాలను అరికట్టడంలో తామే నంబర్‌ వన్‌ అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్, కేటీఆర్‌ గొంతు ఇప్పుడు ఎందుకు మూగబోయింది? ఈ ఘటనలపై ఎందుకు స్పందించడం లేదు’ అని ప్రశ్నించారు. కేసు లు పెడతామంటూ ప్రభుత్వం చేసే తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదన్నారు.  

మరిన్ని వార్తలు