TSPSC Paper Leak Case: తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు.. అరెస్టులు, ఉద్రిక్తతలు..

18 Mar, 2023 13:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణవ్యాప్తంగా బీజేపీ శనివారం భారీ ఆందోళనలు చేపట్టింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌ ఘటనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. మంచిర్యాల, కరీంనగర్, నిజామాబాద్‌ సహా పలు జిల్లా కేంద్రాల్లో బీజేపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. దీంతో పలు చోట్ల ఉద్రికత్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు పలువురు బీజేపీ నాయకులు, శ్రేణులను అరెస్టు చేసి పరిస్థితిని అదుపు చేశారు.


కాగా.. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన తొమ్మిది మంది నిందితులను పోలీసు కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శనివారం వీరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 23వ తేదీ వరకు వారిని ప్రశ్నించి.. ఈ వ్యవహారంలో అన్ని వివరాలను ఆరా తీయనున్నారు. ఇదే సమయంలో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, శంకరలక్ష్యలను కలిపి విచారించి.. వాస్తవాలను వెలికితీయాలని అధికారులు నిర్ణయించారు.
చదవండి: నిందితులను కస్టడీలోకి తీసుకున్న సిట్‌

మరిన్ని వార్తలు