రెవెన్యూ సదస్సుల్లో పోడు హక్కు పత్రాలివ్వాలి: బండి

9 Jul, 2022 02:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులో పోడురైతులకు హక్కుపత్రాలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు. సదస్సుల్లో హక్కుపత్రాలిచ్చి గిరిజనులు, ఆదివాసీల సంక్షేమంపట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఈ మేరకు ఆయన సీఎంకు లేఖ రాశారు. ఈ సమస్య రెవెన్యూ, అటవీ శాఖలతో ముడిపడి ఉన్నందున సదస్సుల్లో అటవీశాఖను కూడా భాగస్వామ్యం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు