బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

11 Jun, 2022 03:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గడీల పాలనను గద్దె దింపేవరకు రాత్రింబవళ్లు పనిచేస్తానని బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. దొరల పాలన అంతా దోపిడీమయంగా సాగుతోం దని.. దళితులు, గిరిజనులు, బహుజనులు నష్టపోతున్నా రని ఆందోళన వ్యక్తం చేశారు. 13 వందల మంది త్యాగా లతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కొందరి చేతుల్లో బందీ అయిందని, అన్నివర్గాలకు న్యాయం దక్కాలంటే దొరల పాలనకు మంగళం పాడాలని పిలుపునిచ్చారు. బీఎస్పీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ప్రవీణ్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో శుక్రవారం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో అభినందన సభ జరిగింది.

దీనికి ముందు బీఎస్పీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ రాంజీ గౌతమ్‌తో కలిసి ప్రవీణ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులపాలు చేశారని, ఉద్యో గులకు వేతనాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని మండి పడ్డారు. సంపత అంతా కొందరి వద్దే ఉండిపోయిందని, అన్ని వర్గాల ప్రజలు ఆప దలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సరైన న్యాయం జరగాలంటే బీఎస్పీకి రాజ్యా ధికారం అప్పగించాలని పిలుపు నిచ్చారు.

కేంద్రంలోని బీజేపీ సర్కారు, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ సర్కారు అగ్రకులా లకే ప్రాధా న్యత ఇస్తున్నాయని మండిపడ్డారు. తాను చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశా రు. రాబోయే ఎన్నికల్లో గెలిచి ఏనుగు మీద ప్రగతిభవన్‌కు వెళ్తామన్నారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడాలని, గ్రామాలకు తరలివెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 

అందరి పార్టీ బీఎస్పీ..
కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీల్లో కేవలం అగ్రవర్ణాలకే పదవులు దక్కుతాయని, వారికి మాత్రమే ప్రాధాన్యత దక్కు తుందని ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. బీఎస్పీ దళిత, గిరిజన, బహుజనులతోపాటు అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత దక్కుతుందని తెలిపారు. రాష్ట్ర జనాభాలో 52శాతం ఉన్న బీసీలకు తమ పార్టీ 70 సీట్లు కేటాయిస్తుం దని ప్రకటించారు.  అనంతరం బీఎస్పీ రాష్ట్ర ఇన్‌చార్జి, ఎంపీ రాంజీ గౌతమ్‌ మాట్లాడారు.

రానున్న ఎన్నికల్లో బీఎస్పీకి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయని, వాటిని అదుపులో పెట్టేందుకు సమర్థుడైన నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. పేదల విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తా మని.. ప్రతి పౌరుడికి ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిం చేందుకు బీఎస్పీ కట్టుబడి ఉంటుందని ప్రకటించారు. అంతకుముందు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 

మరిన్ని వార్తలు