దళితబంధు కాదు.. దగా బంధు: ఆర్‌ఎస్పీ

11 May, 2022 01:10 IST|Sakshi

జూలూరుపాడు: దళితుల అభ్యున్నతి కోసమే దళితబంధు పథ కాన్ని ప్రవేశపెట్టామని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ గొప్పలు చెబుతున్నా.. అది దళి తులను దగా చేసేందుకేనని బీఎస్పీ రాష్ట్ర చీఫ్‌ కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపిం చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి అను చరులకే తప్ప నిరుపేదలకు దళిత బంధు అందడం లేదన్నారు.

ప్రవీణ్‌ చేపట్టిన బహుజ న రాజ్యాధికార యాత్ర మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం లోని అనంతారం, కాకర్ల, పడమట నర్సాపు రం, బేతాళపాడు, గుండ్లరేవు, అన్నారుపాడు, పాపకొల్లు, జూలూరుపాడు గ్రామాల్లో కొనసాగింది. ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకుంటున్నా పేదలు మాత్రం ఇంకా దుఃఖంలోనే ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 

మరిన్ని వార్తలు