Telangana Budget 2023-24: ఈనెల 6వ తేదీన బడ్జెట్‌

3 Feb, 2023 15:40 IST|Sakshi

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అప్‌డేట్స్‌

03:30PM
తెలంగాణ అసెంబ్లీలో బీఏసీ సమావేశం ముగిసింది. ఈనెల 6న రాష్ట్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టాల‌ని నిర్ణ‌యించారు. 8న బ‌డ్జెట్‌, ప‌ద్దుల‌పై చ‌ర్చించ‌నున్నారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై శ‌నివారం అసెంబ్లీలో చ‌ర్చ చేప‌ట్ట‌నున్నారు. ఈ నెల 5, 7 తేదీల్లో అసెంబ్లీకి సెల‌వు ప్ర‌క‌టించారు.

1:35PM

  • ముగిసిన బీఏసీ సమావేశం
  • రేపు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం
  • ఈనెల 6వ తేదీన బడ్జెట్‌. 8వ తేదీన బడ్జెట్‌పై చర్చ

12:45PM

ముగిసిన గవర్నర్‌ తమిళసై ప్రసంగం

కాళోజీ కవితతో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్‌ తమిళసై

  • హరితహారం ద్వారా 7.7 శాతం పచ్చదనం పెంచాం
  • పరిశ్రమలు ఐటీ ద్వారా 3.31 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం
  • హైదరాబాద్‌ చుట్టూ 4 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు
  • 20 జిల్లాల్లో డయాగ్నెస్టిక్‌ సెంటర్లు ఏర్పాటు చేశాం
  • వరంగల్‌లో రూ. 1100 కోట్లతో 2 వేల బెడ్స్‌ సామర్థ్యంతో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్
     
  • రాష్ట్ర వ్యాప్తంగా 342 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం
  • తెలంగాణలో 17 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేశాం
  • ఆశావర్కర్లకు రూ. 9,750 పారితోషికం
  • 203 మైనారిటీ గురుకల పాఠశాలలు ఏర్పాటు
  • ఇప్పటివరకూ 12.5 లక్షల మందికి షాదీ ముబారక్‌
  • ఇప్పటివరకూ 12 లక్షల మందికి కల్యాణలక్ష్మి
  • 80,039 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
  • కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేశాం
  • ఉద్యోగాల్లో స్థానికత కోసం కొత్త చట్టం తెచ్చాం
  • గత ఎనిమిదేళ్లలో 2,21, 774 ఉద్యోగాలను భర్తీ చేశాం
  • రూ. 7,289 కోట్లతో మన ఊరు-మన బడి కింద స్కూళ్ల అభివృద్ధి
  • మన ఊరు-మన బడి ద్వారా మూడు దశల్లో పాఠశాలల్లో మౌలిక వసతులు
  • న్యాయవాదుల కోసం రూ. 100 కోట్లతో సంక్షేమ నిధి
  • జర్నలిస్టుల కోసం రూ. 100 కోట్లతో సంక్షేమ నిధి
  • బతుకమ్మ ఫెస్టివల్‌ చీరల ద్వారా చేనేతలకు ఉపాధి
  • నేతన్నలకు రూ. 5లక్షల బీమా పథకం
  • సివిల్‌ పోలీస్‌ ఉద్యోగాల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్‌
  • రాష్ట్ర జీఎస్‌డీపీలో 18.2 శాతం వ్యవసాయరంగం నుంచే సమకూరుతున్నది
  • తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది
  • దళితబంధు విప్లవాత్మకమైన పథకం
  • ప్రతి దళితుడికి రూ. 10 లక్షల చొప్పున ఇస్తున్నాం
  • పేదలకు చేయూతగా ఆసరా పథకం.. ఆసరా పథకం లబ్ధిదారుల వయస్సు 57కు తగ్గించాం
  • ఎస్టీల రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచాం
  • 11వేల కోట్లతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ
  • మాంసం ఉత్పిత్తిలో తెలంగాణ దేశంలోనే 5వ స్థానంలో ఉంది
     
  • సంక్షేమ అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందుంది
  • తెలంగాణ గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి
  • వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించాం
  • కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలోనే పూర్తి చేశాం
  • రైతు బంధు పథకం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది
  • ఇప్పటివరకూ రూ.65 వేల కోట్లు రైతులకు అందించాం
  • తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి
  • ప్రభుత్వ కృషి వల్ల 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నాం
  • నీటి కోసం గతంలో గొడవలు జరిగాయి.. ఇప్పుడు 24 గంటల పాటు నీటి సరఫరా అందిస్తున్నాం

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం సమక్షంలో జనగణమన ఆలాపనతో సమావేశాలు లాంఛనంగా మొదలయ్యాయి. సీఎం కేసీఆర్‌ దగ్గరుండి గవర్నర్‌కు ‍హాల్‌లోకి స్వాగతం పలికారు. 

  • తెలంగాణ 2023-2024 వార్షిక బడ్జెట్‌ సమావేశాలు కాసేపట్లో..
  • శాసనసభ హాల్‌లో శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగించనున్నారు.

గవర్నర్‌ చదవాల్సిన ప్రసంగ పాఠం బుధవారం రాత్రి ప్రభుత్వం నుంచి రాజ్‌భవన్‌కు చేరింది. దాన్ని పరిశీలించిన గవర్నర్‌.. కొన్ని అంశాలకు సంబంధించి మరిన్ని వివరాలు కోరడంతో పాటు కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం కూడా గవర్నర్‌ సూచనలను పరిగణనలోకి తీసుకుని, ప్రసంగ పాఠంలో పలు మా­ర్పు­లు చేసి తుదిరూపు ఇచ్చినట్లు తెలిసింది. 

శుక్రవారం మధ్యాహ్నం శాసనసభ స్పీకర్, శాసన మండలి చైర్మన్‌ చాంబర్లలో వేర్వేరుగా బిజినెస్‌ అడ్వైజరీ కమిటీలు (బీఏసీలు) సమావేశమవుతాయి. ఇందులోనే అసెంబ్లీ ఎప్పటి నుంచి ఎప్పటివరకు కొనసాగుతుంది? ఎజెండా ఏమిటనేది ఖరారవుతుంది.

► శుక్రవారం గవర్నర్‌ ప్రసంగం తర్వాత వాయిదా పడే సభ శనివారం ఉదయం 10.30కు తిరిగి ప్రారంభం అవుతుంది. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని చర్చించి ఆమోదించిన తర్వాత ఆదివారం సమావేశానికి విరామంగా ప్రకటిస్తారు. ఈ నెల 6న ఉదయం శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్, మండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ నెల 14 వరకు సమావేశాలు కొనసాగే అవకాశమున్నట్లు బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

మరిన్ని వార్తలు