Telangana Budget Session 2022-23: ‘20 ల‌క్ష‌ల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు’

14 Mar, 2022 15:03 IST|Sakshi

►ప‌ట్ట‌ణాల్లో ఉండే పేద‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌ల‌ను అందించేందుకు సీఎం కేసీఆర్ హైద‌రాబాద్ న‌గ‌రంలో బ‌స్తీ ద‌వాఖానాల‌ను ప్రారంభించారని  రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు.జీహెచ్ఎంసీ ప‌రిధిలో ప్ర‌జ‌ల ఆరోగ్య అవ‌స‌రాల‌ను తీర్చ‌డానికి బ‌స్తీ ద‌వాఖానాల‌ను ఏర్పాటు చేశామ‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 259 బ‌స్తీ ద‌వాఖానాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌న్నారు. మ‌రో 91 బ‌స్తీ ద‌వాఖానాల‌ను త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌ని తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల్లో సంద‌ర్భంగా బ‌స్తీ ద‌వాఖానాల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి హ‌రీశ్‌రావు స‌మాధానం ఇచ్చారు.

►తెలంగాణ ఏర్ప‌డిన ఆరు నెలల్లోనే విద్యుత్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించామని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్ప‌త్తి, వినియోగం పెరిగిందని అన్నారు. రాష్ట్రంలో 26 ల‌క్ష‌ల 36 వేల వ్య‌వ‌సాయ క‌నెక్ష‌న్‌లు ఉన్నాయని, 35 వేల కోట్లతో విద్యుత్ రంగ సంస్థల‌కు చేయూత‌నిచ్చామని తెలిపారు. విద్యుత్ న‌ష్టాల‌లో జాతియ స‌గ‌టు కంటె తెలంగాణ స‌గ‌టు త‌క్కువ ఉందని పేర్కొన్నారు. విద్యుత్ తీగ‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఇళ్ళ నిర్మాణం చేయ‌డం వ‌ల్ల ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయని, వాటిని నివారిస్తామని వెల్లడించారు.

►తెలంగాణలో పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగును ప్రోత్స‌హిస్తున్నామ‌ని మంత్రి స్ప‌ష్టం నిరంజ‌న్ రెడ్డి  చేశారు.  రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును విస్త‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు తెలిపారు.శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి నిరంజ‌న్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు. పంట మార్పిడి విధానంలో భాగంగా భారీ స్థాయిలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామ‌ని తెలిపారు. 

►కాసేపట్లో తెలంగాణ శాసన మండలి సమావేశం ప్రారంభం కానుంది. సభ ప్రారంభం కాగానే మండలి చైర్మన్‌ను ప్రొటెం చైర్మన్ జాఫ్రీ ప్రకటించానున్నారు. అనంతరం ఛైర్మెన్ చైర్ వద్ద కొత్త ఛైర్మన్‌ను మండలి సభ్యులు తీసుకెళ్లనున్నారు.

సాక్షి, హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ఆరో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అయితే నేడు జీరో అవర్ కూడా ఉంటుందని, సభ్యులు ప్రశ్నలు అడగాలని, ఉపన్యాసాలు ఇవ్వద్దని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం, ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల ఏర్పాటు, పోలీసు శాఖ ఆధునీక‌ర‌ణ‌, రాష్ట్రంలో విద్యుత్ రంగం, జీహెచ్ఎంసీ ప్రాంతంలో బ‌స్తీ ద‌వాఖానాలు, వ్య‌వ‌సాయ పంపుసెట్ల‌కు ప్రీపెయిడ్ మీట‌ర్లు, వివిధ సంస్థ‌ల నుంచి రుణాలు, నిమ్మ‌కాయ‌ల నిల్వ కొర‌కు న‌కిరేక‌ల్ వ‌ద్ద శీత‌లీక‌ర‌ణ గిడ్డంగి వంటి అంశాల‌పై ప్ర‌శ్నోత్త‌రాలు కొన‌సాగుతున్నాయి. కాగా మార్చి7న ప్రారంభ‌మైన బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. రేప‌టితో బ‌డ్జెట్ స‌మావేశాలు ముగియ‌నున్నాయి.
చదవండి: మండలి చైర్మన్‌గా గుత్తా నామినేషన్‌

మరిన్ని వార్తలు