రేపు తెలంగాణ కేబినెట్‌ భేటీ

12 Nov, 2020 18:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి సమావేశం కానుంది. రేపు ఉదయం (శుక్రవారం) ప్రగతి భవన్‌లో ఈ భేటీ జరుగనుంది. త్వరలో జరుగనున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలపై కేబినెట్‌ ప్రధానంగా చర్చించనుంది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం తొలిసారి మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. దుబ్బాక ఫలితాలపై కూడా ఈ సమావేశంలో సీఎం చర్చించే అవకాశం ఉంది. ఓటమికి గల కారణాలను మంత్రులతో కలిసి విశ్లేషించనున్నారు. అలాగే పట్టభద్రుల కోటాలో జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ స్థానానికి అభ్యర్థి ఎంపికపై సమాలోచనలు జరిపే అవకాశం ఉంది. (డిసెంబర్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు?)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు