సంజయ్‌ వ్యాఖ్యలు అనాగరికం: భట్టి 

28 May, 2022 02:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలోని మసీదులను తవ్వి చూద్దాం.. శవాలు వస్తే మీవి, శివాలు (శివలింగం) వస్తే మావి..’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు.

సంజయ్‌ వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ఆయన వ్యాఖ్యలు మధ్యయుగ రాచరిక భావాలతో కూడినవని శుక్రవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు అనాగరికం, దురదృష్టకరమని భట్టి పేర్కొన్నారు. బండి సంజయ్‌ను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.  

మరిన్ని వార్తలు